ramgopal verma: తనకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ కు ఘాటు సమాధానం ఇచ్చిన రాం గోపాల్ వర్మ!

  • టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ కు వర్మ కౌంటర్
  • తెలుగు రాష్ట్రాలేమైనా నీ అబ్బ సొత్తా?
  • తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వవా?
  • అసలు నువ్వెవరో నాకు తెలియదు
  • చేతనైతే ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకో
  • ఎన్టీఆర్ ఆశయాలను అనుసరించేవాడే నిజమైన అభిమాని

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకు చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాలని, డైలాగ్ టు డైలాగ్ చంద్రబాబుకు చూపించాలని టీడీపీ ఎమ్మెల్యే బాబూరాజేంద్ర ప్రసాద్ ఇటీవల డిమాండ్ చేశారు. దీనిపై రాంగోపాల్ వర్మ ఘాటుగా సమాధానం చెప్పాడు...

తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా? అని ప్రశ్నించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వనంటున్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని రాంగోపాల్ వర్మ అన్నాడు. చేతనైతే రాజకీయాలను ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌ ను రోల్ మోడల్‌ గా తీసుకోవాలని రాజేంద్ర ప్రసాద్ కు వర్మ సూచించాడు. ఎన్టీఆర్‌ నిర్ణయాలను ఫాలో అయిన వాడే నిజమైన ఫాలోవర్స్ అని రామ్‌ గోపాల్ వర్మ ఆయనకు స్పష్టం చేశాడు. 

ramgopal verma
ntr
ntr movie
rajendra prasd
Telugudesam mlc
  • Loading...

More Telugu News