Dhoni: ధోనీకి మళ్లీ నిరాశ.. పద్మభూషణ్ ఈసారీ హుళక్కే?

  • గతంలో రెండుసార్లు తిరస్కరణ
  • ఈసారీ అదే రిపీటయ్యే అవకాశం
  • ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసే కారణం

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఈసారి కూడా పద్మభూషణ్ పురస్కారం లభించే అవకాశాలు కనిపించడం లేదు. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌కు ధోనీ 2013, 2016లో  రెండుసార్లు నామినేట్ అయ్యాడు. తాజాగా బీసీసీఐ బుధవారం మరోమారు ఆయన పేరును ఈ పురస్కారానికి ప్రతిపాదించింది. గతంలో రెండుసార్లూ కేంద్రం ధోనీ పేరును తిరస్కరించింది. ఈసారి కూడా అదే జరిగే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ధోనీకి ఈ అవార్డు అందని ద్రాక్షగా మారుతుండడం వెనక ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా ధోనీ పేరు పదేపదే చర్చకు రావడమే ఆయన పేరును ఈ అవార్డుకు పరిగణనలోకి తీసుకోకపోవడానికి కారణమని సమాచారం.

Dhoni
cricketer
team india
padma bhushan
  • Loading...

More Telugu News