dinchak pooja: యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న డింఛ‌క్ పూజ కొత్త వీడియో


యూట్యూబ్ సెన్సేష‌న్ డింఛ‌క్ పూజ మ‌రో కొత్త వీడియోతో త‌న హ‌వా చాటుకుంటోంది. `బాపూ దేదే తోడా క్యాష్ (నాన్న... కొన్ని డ‌బ్బులు ఇవ్వండి)` పేరుతో విడుద‌లైన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. అప్‌లోడ్ అయిన ఒక్క రోజులోనే 76వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు. అయితే ఈ పాటను ఇంత‌కుముందే పూజ‌ విడుద‌ల చేసింది, కాక‌పోతే అది కేవ‌లం ఆడియో మాత్ర‌మే.

 ఇప్పుడు పాట‌కు త‌గ్గ‌ట్టుగా యాక్టింగ్ చేస్తూ వీడియోను రూపొందించి పూజ విడుద‌ల చేసింది. గ‌తంలో స్వాగ్ వాలీ టోపీ, దారు, సెల్ఫీ మైనే లేలీ ఆజ్‌, దిల్లోంక షూట‌ర్ వంటి పాట‌ల‌తో యూట్యూబ్ సెన్సేష‌న్‌గా డింఛ‌క్ పూజ మారింది. క‌ర్ణ‌క‌ఠోరంగా పాట‌లు పాడ‌టంలో పేరు సంపాదించుకున్న పూజ‌కి ఎంత‌మంది విమ‌ర్శ‌కులు ఉన్నారో అంత‌కంటే ఎక్కువ మంది అభిమానులు కూడా ఉన్నారు. ఈ ప్రాచుర్యం కార‌ణంగానే ఈ మ‌ధ్య బిగ్‌బాస్ 11లో డింఛ‌క్ పూజ పాల్గొన‌బోతుంద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News