dinakaran: దినకరన్ వర్గానికి షాక్.. ఎమ్మెల్యేపై ఐటీ దాడులు!


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తిరుగుబాటు చేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యేలను కేంద్ర సంస్థలు టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. దినకరన్ వర్గంలోని కీలక నేత, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆయనకు చెందిన ఆస్తులపై పదిచోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ అంశం ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ వేటు వేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, తమ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించకూడదంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. 

dinakaran
tamil politics
shock to dinakaran team
  • Loading...

More Telugu News