jc diwakar reddy: ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా: జేసీ దివాకర్ రెడ్డి

  • ఎంపీగా విఫలమయ్యా
  • నీరు కూడా తీసుకురాలేకపోయా
  • టీడీపీలోనే కొనసాగుతా
  • 2019లో కూడా టీడీపీదే విజయం

టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన ప్రకటించారు. ఎంపీగా తాను ఫెయిల్ అయ్యానని తన మనస్సాక్షి చెబుతోందని ఆయన అన్నారు. సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లి, లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖను అందిస్తానని చెప్పారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోని చాగల్లు రిజర్వాయర్ కు నీరు కూడా తీసుకురాలేని తనకు ఎంపీ పదవి ఎందుకని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.

అయితే, కేవలం ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని... టీడీపీకి కాదని జేసీ తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను భవిష్యత్తులో కూడా పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేవలం ప్రజాభిమానంతోనే తాను ఎంపీనయ్యానని... ఎవరి దయాదాక్షిణ్యాలతోనో కాదని అన్నారు. 

jc diwakar reddy
jc divakar reddy
Telugudesam mp
ananthapur mp
jc announces resignation
  • Loading...

More Telugu News