Cheque book: విలీనమైన బ్యాంకుల చెక్ బుక్‌లు ఇక చెల్లవు.. కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోండి.. ఎస్‌బీఐ సూచన


భారతీయ మహిళా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లు గతంలో జారీ చేసిన చెక్ బుక్‌లు పనిచేయవని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబరు 30 తర్వాత ఈ బుక్‌లు పనికిరాకుండా పోతాయని, కాబట్టి ఆయా బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఆరు బ్యాంకులు ఇటీవల ఎస్‌బీఐలో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు తర్వాత ఆయా బ్యాంకుల చెక్ బుక్‌లతోపాటు ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు చెల్లవని తెలిపింది. ఖాతాదారులందరూ తమ చెక్‌బుక్‌లను వెంటనే రీప్లేస్ చేసుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News