jio fi: జియో దసరా ధమాకా.. రూ.999కే జియో- ఫై!


దసరా పండుగను పురస్కరించుకుని రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.1999  విలువైన జియో ఫైని రూ.999కే అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ పరికరం ద్వారా 2జీ, 3జీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వేగవంతమైన డేటాను పొందవచ్చు. అంతేకాక కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి పది పరికరాలను దీనితో అనుసంధానం చేసుకోవచ్చు.

జియో ఫై నుంచి కాల్స్ చేసుకునేందుకు తొలుత ప్లేస్టోర్ నుంచి ‘జియో 4జీ వాయిస్’ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో జియోఫైని అనుసంధానం చేసుకోవడం ద్వారా వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ఇక కాల్ అందుకున్న వ్యక్తికి జియో ఫై నంబరు స్క్రీనుపై కనిపిస్తుంది. అవతలి వ్యక్తి కావాలనుకుంటే ఈ నంబరుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కూడా.


jio fi
reliance
dasara
offer
  • Loading...

More Telugu News