chandrababu: రైతులకు శుభవార్త అందించిన చంద్రబాబు!

  • మూడో విడత రుణ మాఫీకి సర్వం సిద్ధం
  • త్వరలోనే తేదీ ప్రకటిస్తామన్న సీఎం
  • 'ప్రజలే ముందు' అనే మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు పెంచాలంటూ ఆదేశం

రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. మూడో విడత రైతు రుణమాఫీని చేపట్టబోతున్నామని... త్వరలోనే తేదీని వెల్లడిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిలో ఈ రోజు కలెక్టర్లతో సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యానవన పంటల సాగును కోటి ఎకరాలకు పెంచాలని ఆదేశించారు. వ్యవసాయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోటీ పడాలని అన్నారు. పరిశ్రమల రంగంలో మహారాష్ట్ర, తమిళనాడులు ముందున్నాయని... పరిశ్రమల రంగంలో 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించాలని చెప్పారు. 'మీ ఇంటికి మీ భూమి' ద్వారా 5.20 కోట్ల భూ రికార్డులను సరి చేశామని తెలిపారు. కేవలం 15 నిమిషాల్లోనే పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 'మంత్రిమండలి' కరదీపికను, 'ప్రజలే ముందు' మొబైల్ అప్లికేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 

chandrababu
collectors conference
mee intiki mee bhoomi
prajale mundu
  • Loading...

More Telugu News