rohingya activists: రోహింగ్యా వాదుల అకౌంట్లను, పోస్ట్‌లను కట్టడి చేస్తున్న ఫేస్‌బుక్?
- వందల సంఖ్యలో ఫేస్‌బుక్ అకౌంట్ల నిలిపివేత
- ఆరోపిస్తున్న సామాజికవాదులు
- ప్రమాణాలలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఫేస్‌బుక్
మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింల దైన్యస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారి బాగు కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న సామాజిక వాదుల పోస్టులను ఫేస్‌బుక్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. నిజాన్ని బయటికి రానీయకుండా ఫేస్‌బుక్ తమ అకౌంట్లను నిలిపివేసి, గొంతు నొక్కేస్తోందని చాలా మంది రోహింగ్యా వాదులు ఆరోపిస్తున్నారు. వీరి విషయంలో మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడంలో గానీ, పౌరసత్వం జారీ చేసే విషయంలో గానీ స్పష్టతనివ్వడం లేదు.
దీంతో వీరు ఏ దేశానికి చెందినవారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వీరి కోసం మద్దతు కూడగడుతున్న సామాజిక వాదుల అకౌంట్లను, పోస్ట్‌లను ఫేస్‌బుక్ నియంత్రించడం సబబు కాదని రోహింగ్యా వాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహింగ్యా వాదుల పోస్ట్ చేసే వ్యాఖ్యలు తమ సంస్థ విధివిధానాలకు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అందుకే వాటిని నియంత్రిస్తున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధి రుచిక బుధ్రాజ తెలిపారు.