rajamouli: అమరావతిని చుట్టేస్తున్న రాజమౌళి... వెంటుండి తిప్పుతున్న సీఆర్డీయే కమిషనర్

  • సచివాలయం, అసెంబ్లీలను చూసిన రాజమౌళి
  • విశేషాలు చెప్పిన సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్
  • మధ్యాహ్నం వరకూ వెలగపూడిలోనే రాజమౌళి
  • ఆపై చంద్రబాబుతో మరోసారి భేటీ

రెండు రోజుల అమరావతి పర్యటన నిమిత్తం ఈ ఉదయం విజయవాడకు వచ్చిన దర్శకుడు రాజమౌళి, ఉదయం చంద్రబాబుతో సమావేశం అనంతరం, అమరావతిలో ఇప్పటికే నిర్మితమైన భవనాలను సందర్శించేందుకు వెలగపూడి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు కూడా ఉన్నారు.

 వీరంతా ప్రస్తుతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను రాజమౌళికి దగ్గరుండి చూపుతున్నారు. భవనాలను త్వరగా నిర్మించేందుకు వాడిన సాంకేతికత, పెట్టిన ఖర్చు తదితర వివరాల గురించి రాజమౌళికి శ్రీధర్ వివరించారు. మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ అమరావతిలోనే గడపనున్న రాజమౌళి, భోజనం అనంతరం సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ కానున్నారు.

rajamouli
amaravati buildings
chandrababu
  • Loading...

More Telugu News