hardik pandya: పాండ్యాపై కామెంట్.. పాక్ మహిళా జర్నలిస్టుపై భారత క్రికెట్ అభిమానుల మండిపాటు

  • పాండ్యాను బెన్ స్టోక్స్ తో పోల్చడం సరికాదన్న పాక్ జర్నలిస్ట్
  • విరుచుకుపడ్డ భారత అభిమానులు
  • పాండ్యాలాంటి ఆటగాడు మీ దేశంలో లేడనేదే నీ బాధ అంటూ మండిపాటు

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా కేవలం 66 బంతుల్లో 83 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు పాకిస్థాన్ కు చెందిన మహిళా జర్నలిస్టు ఫలీజా సాబా ట్విట్టర్లో స్పందిస్తూ, "పాండ్యా గొప్ప ఆల్ రౌండర్ గా ఎదగగలడు. కానీ, ఆయనను భారతీయ మీడియా బెన్ స్టోక్స్ తో పోల్చడం సరికాదు" అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు, పాండ్యా పేరును పాండే అంటూ తప్పుగా కూడా రాసింది. దీంతో, ఆమెపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

'ఫజీలా, నీవు చెప్పింది కరెక్టే... స్టోక్స్ కంటే కూడా పాండ్యానే బెటర్' అంటూ కొందరు స్పందించారు. 'పాండ్యాలాంటి ఆటగాటు మీ దేశంలో లేరనే కదా నీ బాధ' అంటూ మరికొందరు ఎద్దేవా చేశారు. 'కనీసం పాండ్యా పేరు స్పెలింగ్ రాయడం కూడా రాని నీవా... అతని గురించి మాట్లాడేది' అని ఇంకొందరు విరుచుకుపడ్డారు.

hardik pandya
team india
pakistan women reporter
journalist faliza saba
  • Loading...

More Telugu News