deeksha panth: 'బిగ్ బాస్'లో ధన్ రాజ్ ధోరణి .. అర్చన తీరు బాధించాయి!: దీక్షా పంత్

  • క్రితం వారం 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి వచ్చిన దీక్షా పంత్
  •  తాను కెప్టెన్ గా వున్నప్పుడు చేసిన పనులు చూపించలేదు
  •  ధన్ రాజ్ ధోరణి నచ్చలేదు
  •  అర్చన వ్యవహరించిన తీరు బాధించింది

'స్టార్ మా'లో అత్యంత ఆసక్తిని రేపుతూ 'బిగ్ బాస్' షో కొనసాగుతోంది. 'బిగ్ బాస్' హౌస్ నుంచి క్రితం వారం దీక్షా పంత్ బయటికి వచ్చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అక్కడ తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించింది. 'బిగ్ బాస్' హౌస్ లో తనకి తెలిసినవారికంటే తెలియనివారే ఎక్కువగా ఉండటం వలన, వారితో తొందరగా కలవలేకపోయానని చెప్పింది.

 ధన్ రాజ్ ధోరణి తనకి నచ్చలేదనీ .. అలాగే అర్చన వ్యవహరించిన తీరు కూడా తనకి చాలా బాధ కలిగించిందని తెలిపింది. తన పని తాను చేసుకువెళ్లే దానిననీ, కంటెస్టెంట్స్ మధ్య ఏదైనా డిస్కషన్ జరిగితే టీవీలో చూపిస్తారనే సంగతి తనకి బయటికి వచ్చాకే తెలిసిందని చెప్పింది. తాను కెప్టెన్ గా వున్నప్పుడు చేసిన పనులను చూపకపోవడం కూడా తనకి అసంతృప్తిని కలిగించిందని వాపోయింది.  

deeksha panth
  • Loading...

More Telugu News