kanche ilaiah: కంచె ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు!

  • 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంపై వైశ్యుల ఆగ్రహం 
  • ఆర్యవైశ్యుల కేసులన్నీ సీఐడీకి బదిలీ
  • పుస్తక నిషేధంపై అధికారుల పరిశీలన

తెలుగు రాష్ట్రాల్లోని మేధావుల్లో ఒకరిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య... తాను రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకంతో వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. దీనిపై ఇప్పటికే ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ఐలయ్యపై పోలీస్ కేసులు పెట్టారు. మరోవైపు, ఐలయ్యపై కేసు నమోదు చేయాలంటూ ఏపీ డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు.

 ఈ నేపథ్యంలో, ఈ పుస్తకానికి సంబంధించి ఐలయ్యపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఐలయ్య వ్యవహారశైలి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఐలయ్యపై నమోదైన కేసులన్నింటినీ, సీఐడీకి బదిలీ చేశారు. పుస్తక నిషేధంపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఐలయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

kanche ilaiah
kancha ilaiah
samajika smaglarlu komatollu
case filed on ilaiah
cid case on ilaiah
  • Loading...

More Telugu News