rajamouli: అరగంట సేపు చంద్రబాబుతో మాట్లాడాను... మళ్లీ మధ్యాహ్నం కలుస్తా: రాజమౌళి

  • రాజధాని ఆకృతులపై ప్రాథమిక చర్చ
  • కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు వెళ్లిపోయిన చంద్రబాబు
  • మరోసారి భేటీ కావాలని నిర్ణయం
  • అదృష్టంతోనే ఈ అవకాశం లభించిందన్న రాజమౌళి

ఈ ఉదయం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో భవన నిర్మాణాల ఆకృతులపై చర్చించిన దర్శక దిగ్గజం రాజమౌళి, అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను అరగంట పాటు చంద్రబాబుతో సమావేశం అయినట్టు ఆయన తెలిపారు. రాజధాని ఆకృతులు ఎలా ఉండాలన్న విషయంలో సీఎం తన మదిలోని ఆలోచనలను పంచుకున్నారని, ఆయన దూరదృష్టి తనకెంతో నచ్చిందని వెల్లడించారు.

ప్రస్తుతానికి ప్రాథమిక ఆకృతులపై తాము చర్చించామని రాజమౌళి చెప్పారు. కలెక్టర్ల సదస్సుకు ముఖ్యమంత్రి వెళ్లాల్సి వున్నందున, మధ్యాహ్నం మరోసారి భేటీ అవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం సమావేశంలో చంద్రబాబుతో మరింత విపులంగా మాట్లాడి, ఆయనకు ఎటువంటి ఆకృతులు కావాలన్న విషయమై తానో అవగాహనకు వస్తానని చెప్పారు. తాను లండన్ కు వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తనకు లభించిన ఓ మంచి అవకాశమని రాజమౌళి వ్యాఖ్యానించారు.

rajamouli
amaravati buildings
chandrababu
  • Loading...

More Telugu News