Gandhi hospital: గాంధీ ఆసుపత్రిలో వైద్యుల మెరుపు సమ్మె... నిలిచిపోయిన సేవలు!

  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి
  • వైద్యుడిపై బంధువుల దాడి
  • మెరుపుసమ్మెకు పిలుపునిచ్చిన గాంధీ వైద్యులు
  • నిలిచిన అన్ని రకాల సేవలు 

హైదరాబాదులోని ప్రతిష్ఠాత్మక గాంధీ సర్వజన ఆసుపత్రి వైద్యులు మెరుపుసమ్మెకు దిగారు. దీంతో వైద్యసేవలన్నీ నిలిచిపోయాయి. దాని వివరాల్లోకి వెళ్తే... గత రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక రోగి మృతిచెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆ రోగి బంధువులు డ్యూటీ డాక్టర్ పై దాడికి దిగారు. దీనికి నిరసనగా వైద్యులు మెరుపుసమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో నేటి వేకువ జాము నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలను కూడా వైద్యులు బహిష్కరించడం విశేషం. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Gandhi hospital
Gandhi hospital doctors
doctors stopped medication
  • Loading...

More Telugu News