Ram gopal Varma: రాంగోపాల్ వర్మను తక్షణం అరెస్టు చేయండి: 'వంగవీటి' సినిమా కేసులో విజయవాడ న్యాయస్థానం ఆదేశం

  • ‘వంగవీటి’ సినిమాపై ఆదిలోనే అభ్యంతరం వ్యక్తం చేసిన వంగవీటి రాధా
  • తమ కుటుంబాన్ని అవమానపరిచారని కోర్టులో కేసు
  • నెలలపాటు విచారించిన న్యాయస్థానం
  • వర్మ, కిరణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశం

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లను అరెస్టు చేయాలని విజయవాడ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీని వివరాల్లోకి వెళ్తే...వర్మ దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మాతగా ‘వంగవీటి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సమయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆ సమయంలో వర్మ తాను తీయదలచుకున్న సినిమాపై వారికి వివరణ కూడా ఇచ్చారు.

అయితే, వర్మ తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా, వాస్తవాలను వక్రీకరించి, ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపరిచారని రంగా తనయుడు రాధా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

Ram gopal Varma
Vangaveeti movie
Vangaveeti Radha Krishna
dasari kiran
  • Loading...

More Telugu News