iphone 8 plus: ఐఫోన్ ఎక్స్ ఫీచర్లను చిన్న స్క్రీన్‌లో అందిస్తున్న ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 ప్లస్ రివ్యూ
ఒకేసారి మూడు మోడళ్లను (ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్) ఆపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రకటించడంతో వీటిలో ఏది కొనాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ ఎక్స్ ఫీచర్లనే చిన్న సైజు స్క్రీన్‌లో అందించే ఐఫోన్ 8 ప్లస్ కొనడమే ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్ 7 ప్లస్ కంటే ఇది ఉత్తమమని, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు అప్‌గ్రేడెడ్ ప్రాసెస్ ఇందులో ఉన్నాయని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే... దీనిలో ఉన్న అప్‌గ్రేడెడ్ కెమెరా సెన్సార్ల వల్ల తక్కువ కాంతిలోనూ చక్కటి ఫొటోలు తీసుకోవచ్చు. డ్యూయల్ కెమెరా ఫీచర్స్ కూడా ఇందులో అభివృద్ధి చేశారు.
పోర్‌ట్రెయిట్ మోడ్‌తో పాటు మరికొన్ని 3డీ లైటింగ్ లెవల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ త్రీడీ లెవల్ ఎఫెక్ట్స్ అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక వేగం విషయంలో ఐఫోన్ 8 ప్లస్‌కి వంక పెట్టాల్సిన అవసరం లేదు. నిజజీవితంలో త్రీడీ బొమ్మలను చూపించగల ఆగ్‌మెంటెడ్ రియాలిటీ టెక్నిక్ ఇందులో కొత్తగా వచ్చింది. ఫేస్ ఐడీ, హోం బటన్ ఐఫోన్ ఎక్స్‌లో లేవని విమర్శిస్తున్న వాళ్లందరూ ఐఫోన్ 8 ప్లస్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఐఫోన్ ఎక్స్‌లో ఉన్న దాదాపు అన్ని రకాల ఫీచర్లను ఐఫోన్ 8 ప్లస్ అందిస్తోంది. కాకపోతే స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది అంతే!