chahal: కోహ్లీ కెప్టెన్సీ నన్ను అటాకింగ్ బౌలర్ గా మార్చింది: చాహల్
- మణికట్టు బౌలర్ అటాకింగ్ గేమ్ ఆడుతాడు
- కెప్టెన్ దూకుడుగా ఉంటే ఆటగాడు మరింత దూకుడుగా ఆడుతాడు
- ప్రతికూల పరిస్థితుల్లో తగ్గి ఆడాల్సి ఉంటుంది
- ధోనీ, పాండ్యా బ్యాటింగ్ అదుర్స్
టీమిండియాలో సుస్థిర స్థానం కోసం ఎదురు చూస్తున్న యజువేంద్ర చాహల్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడిన తొలి వన్డేలో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చాహల్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడడం తనకు లాభించిందని అన్నాడు. దూకుడుగా ఉండే కోహ్లీ సారథ్యంలో అలాంటి ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుందని, ఇదే తనను అటాకింగ్ బౌలర్ గా మార్చిందని తెలిపాడు.
మణికట్టుతో బంతిని తిప్పే స్పిన్నర్లు అటాంకింగ్ బౌలింగ్ ను నమ్ముకుంటారని చాహల్ తెలిపాడు. దానికి దూకుడు తోడైతే మరింత అటాకింగ్ తో ప్రత్యర్థిని చిక్కుల్లో పడేయొచ్చని తెలిపాడు. కెప్టెన్ దూకుడుగా ఉంటే, ఆటగాడికి కూడా మరింత దూకుడుగా ఆడే వెసులుబాటు ఉంటుందని చాహల్ అభిప్రాయపడ్డాడు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో తగ్గి ఆడాల్సి ఉంటుందని చాహల్ తెలిపాడు. అలాంటి సమయాల్లో పరిస్థితులను ఆకళింపు చేసుకుని ప్రణాళికలు మార్చుకుని ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. తొలి వన్డేలో ధోనీ, పాండ్య అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కితాబునిచ్చాడు.