jr ntr: చెయ్యాలని ఉంది...కానీ భయంగా ఉంది: జూనియర్ ఎన్టీఆర్

  •  అదుర్స్ ని టచ్ చెయ్యాలంటే భయంగా ఉంది
  • ఆచారి పాత్రను మరోసారి అంత అద్భుతంగా చెయ్యలేనేమోనని ఆందోళన
  • ఆచారి పాత్ర మాస్టర్ పీస్ లాంటిది
  • అంతకంటే అద్భుతంగా చేయకున్నా పర్వాలేదు కానీ, దానిని పాడుచెయ్యకూడదు

ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేసేయగల జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్ర పోషించాలంటే మాత్రం ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే వివిధ పాత్రల్లో అలరించి, తాతకు తగ్గ మనవడని పేరుతెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందుతున్న పాత్ర కూడా గతంలో అతను పోషించినదే కావడం విశేషం. 'అదుర్స్' సినిమాకి సీక్వెల్ చెయ్యాలని ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. అదే సమయంలో ఆ సినిమా చేయాలంటే భయంగా ఉందని కూడా చెప్పాడు.

ఆ సినిమాలో ఆచారి పాత్ర మాస్టర్ పీస్ అని, మళ్లీ తాను ఆ పాత్రను చేస్తే అంత బాగా చెయ్యగలనా? అన్నదే తన అనుమానమని అన్నాడు. ఆ పాత్రను అంత బాగా చేయలేనప్పుడు గతంలో చేసిన దానిని చెడగొట్టకుండా ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. అందుకే అదుర్స్ సీక్వెల్ అంటే భయమేస్తోందని చెప్పాడు. అయితే భవిష్యత్ ను ఎవరూ ఊహించలేమని, అదుర్స్ సీక్వెల్ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 

jr ntr
jailava kusha promotion
adurs sequel
adurs
achari
  • Loading...

More Telugu News