drunk n drive: ఎల్బీనగర్ లో తాగుబోతు హల్ చల్... 'గుండెపోటు' అంటూ పోలీసులను పరుగులు పెట్టించిన వైనం!

  • డ్రంకెన్ డ్రైవ్ సమయంలో కుప్పకూలిన తాగుబోతు
  • గుండె పోటు అంటూ పోలీసుల పరుగులు
  •  హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • గుండెపోటు కాదు నాటకం అని తేల్చిన వైద్యులు
  •  అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఒక తాగుబోతు నడి రోడ్డుపై కుప్పకూలి పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గత అర్థరాత్రి ఎల్బీనగర్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ దారిలో వెళ్తున్న వాహన చోదకులను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తిని తనిఖీ చేస్తుండగా...అతను గుండె పట్టుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు  అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు చికిత్స అందించిన వైద్యులు... ఆయనకు గుండె నొప్పి రాలేదని, పోలీసు తనిఖీలకు భయపడి ఆయన గుండెపోటు నాటకం ఆడాడని తేల్చిచెప్పారు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

drunk n drive
lb nagar
frinker
drinker heart attack
  • Loading...

More Telugu News