mahesh babu: సంక్రాంతి బరి నుంచి కొరటాల - మహేశ్ మూవీ తప్పుకుంటుందా?

  •  'స్పైడర్' షూటింగు జాప్యం తాజా సినిమాపై పడింది
  •  ఈ కారణంగా 'భరత్ అను నేను' షెడ్యూల్స్ లో మార్పులు
  •  సంక్రాంతికి థియేటర్లకు రాకపోవచ్చు
  •  మార్చి 30న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు      

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లోని 'భరత్ అను నేను' .. షూటింగు దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అసెంబ్లీ సెట్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

 సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. 'స్పైడర్' సినిమా షూటింగ్ విషయంలో జరిగిన ఆలస్యం ప్రభావం, 'భరత్ అను నేను' షెడ్యూల్స్ పై పడింది. ఈ కారణంగా ముందస్తుగా వేసుకున్న షెడ్యూల్స్ లో మార్పులు చేసుకుంటూ వెళుతున్నారు. అందువలన సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లకు తీసుకురావడం కష్టమేనని తెలుస్తోంది. మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం.       

  • Loading...

More Telugu News