sushma swaraj: ఉత్తర కొరియాకు పాకిస్థాన్ సహకరిస్తోంది: అమెరికాలో సుష్మా స్వరాజ్ సంచలన వ్యాఖ్యలు

  • పాకిస్థాన్ పై సుష్మ పరోక్ష వ్యాఖ్యలు
  • విచారణ జరిపించాలని డిమాండ్
  • అమెరికా పర్యటనలో సుష్మ

ప్రపంచ దేశాల సూచనలను, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా చేపడుతున్న అణుపరీక్షలకు పాకిస్థాన్ సహకరిస్తోందంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాతో పాకిస్థాన్ కు ఉన్న అణ్వస్త్ర సంబంధాలను నిగ్గుతేల్చేందుకు విచారణ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రస్తుతం సుష్మ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జపాన్ భూభాగం మీదుగా ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టిన నేపథ్యంలో సుష్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దూకుడుగా ముందుకు సాగుతున్న ఉత్తర కొరియా వైఖరిని సుష్మ తప్పుబట్టారు. కొరియా అణు కార్యక్రమాలకు సహకరిస్తున్న వారిపై చర్యలు చేపట్టాల్సిందేనంటూ ఆమె అన్నారు.

sushma swaraj
sushma targets pakistan
north korea
pakistan
  • Loading...

More Telugu News