kanche ilaiah: కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయండి: డీజీపీ ఆదేశం

  • వివాదాస్పదమైన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం
  • సీఎం చంద్రబాబుతో చర్చించిన డీజీపీ
  • పుస్తకాన్ని నిషేధించాలంటున్న ఆర్యవైశ్యులు
  • ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా పుస్తకాన్ని రచించారని... తమను స్మగ్లర్లుగా పేర్కొన్నారని ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు.

కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో, కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలంటూ డీజీపీ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరోవైపు, ఈ పుస్తకాన్ని నిషేధించాలని, ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

kanche ilaiah
ap dgp
ap dgp orders to file case against kanche ilaiah
  • Loading...

More Telugu News