ivanka trump: కేంద్ర మంత్రి సుష్మాపై ప్రశంసలు కురిపించిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె!

  • సుష్మాను కలవడం ఎంతో గర్వంగా ఉంది
  • మా మధ్య గొప్ప చర్చ జరిగింది
  • యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కలుసుకున్న సుష్మా, ఇవాంకా
  • ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసిన ఇవాంకా

భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ట్రంప్ కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకాతో సుష్మా న్యూయార్క్ లో భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వీరిరువురూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుష్మాను ఇవాంకా కలిశారు. వీరిరువురూ వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ తో పాటు ఇరు దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు.

భేటీ అనంతరం సుష్మాపై ఇవాంకా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. భారత దేశానికి చెందిన, ఛరిష్మా కలిగిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలుసుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు. వుమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, త్వరలో జరగనున్న జీఈఎస్2017, అమెరికా, భారత్ లలో వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ గురించి తమ మధ్య గొప్ప చర్చ జరిగిందని ఆమె తెలిపారు.



ivanka trump
sushma swaraj
ivnka trump meeting with sushma
  • Loading...

More Telugu News