student gang rape: రాజస్థాన్ లో దారుణం... విద్యార్థినిని చెరబట్టిన కాలేజీ డైరెక్టర్, లెక్చరర్!

  • అదనపు క్లాసులని అత్యాచారం
  • గర్భందాల్చడంతో బలవంతంగా అబార్షన్
  • విద్యార్థిని పరిస్థితి విషమం
  • గ్యాంగ్ రేప్ కేసు నమోదు
  • అబార్షన్ చేసిన వైద్యులపై కూడా కేసు  

రాజస్థాన్ లోని శికర్ జిల్లా షహర్ పురాలో దారుణం చోటుచేసుకుంది. మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల డైరెక్టర్, లెక్చరర్ తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని చెరబట్టారు. స్థానికంగా నివాసముండే బాధితురాలిని అదనపు క్లాసుల పేరుతో కాలేజీ డైరెక్టర్‌ జగదీష్ యాదవ్, లెక్చరర్‌ జగత్ సింగ్ గుర్జార్ లు పిలిపించుకునేవారు. ఇద్దరూ కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవారు. ఇంట్లో చెబితే తప్పు తనదే అంటారని భయపడ్డ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది.

ఈ క్రమంలో విద్యార్థిని గర్భందాల్చింది. దీంతో తాము చిక్కుల్లో పడతామని ఆందోళన చెందిన జగదీష్ యాదవ్, జగత్ సింగ్ గుర్జార్ లు స్థానికంగా ఆసుపత్రి నడుపుతున్న వైద్య దంపతులు రజ్నీష్ శర్మ, కానన్ లను సంప్రదించారు. వారు ఆమెకు అబార్షన్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి, ఆమె పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల డైరెక్టర్, లెక్చరర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేశారు. రేపిస్టులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంపై వైద్యులపై కూడా కేసు నమోదు చేశారు. 

student gang rape
Rajastan
Jaipur
director
lecturer
  • Loading...

More Telugu News