america: ఉత్తరకొరియాను నేరుగా రెచ్చగొట్టిన అమెరికా యుద్ధవిమానాలు

  • ద్వీపకల్పం మీదుగా ఎగిరిన అమెరికా యుద్ధ విమానాలు
  • సాధారణ మాక్ డ్రిల్ అంటూ ప్రకటించిన దక్షిణకొరియా 
  • మరిన్ని విన్యాసాలు చేస్తామంటూ ప్రకటన
  • దక్షిణ కొరియాలో పాగా వేసిన అమెరికా సైన్యం

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నప్పటికీ అణుక్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ సరిహద్దు సముద్ర జలాల్లో పడేలా క్షిపణి పరీక్షలు నిర్వహించి, తామెవరికీ భయపడమని పరోక్ష ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరకొరియాను నేరుగా రెచ్చగొట్టేందుకు అమెరికా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. దక్షిణ కొరియా-ఉత్తరకొరియా మధ్యనున్న పెనిన్సులా మీదుగా ఆరు యుద్ధవిమానాలను అమెరికా నడిపింది.

ఇందులో దక్షిణ కొరియాకు చెందిన నాలుగు ఎఫ్-15 యుద్ధ విమానాలతోపాటు అమెరికా మిలటరీకి చెందిన నాలుగు ఎఫ్-35బీ యుద్ధ విమానాలు, రెండు బీ-1బీ బాంబర్స్ సంయుక్తంగా దూసుకెళ్లాయని దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది. మాక్ డ్రిల్ లో భాగంగా ఈ విన్యాసం చేసినట్టు వెల్లడించింది. ఇలాంటి మాక్ డ్రిల్స్ చాలా చేస్తామని దక్షిణ కొరియా రక్షణ శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించినా యుద్ధం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉత్తరకొరియాపై కారాలు మిరియాలు నూరుతున్న అమెరికా ఇప్పటికే 28,000 మంది సైనికులను దక్షిణకొరియా సరిహద్దుల్లో మోహరించిన సంగతి తెలిసిందే. 

america
south Korea
war
north korea
bombers
army fleet
  • Loading...

More Telugu News