errabelli convoy accident: ఎర్రబెల్లి కాన్వాయ్ కి ప్రమాదం...!

  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాన్వాయ్ కి ప్రమాదం
  • ఢీ కొట్టిన కార్లు చెరువులో బోల్తా
  • జీసీసీ ఛైర్మన్, కారు డ్రైవర్ కు గాయాలు
  • క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చిన ఎర్రబెల్లి

టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని కడవెండి నుంచి మాదాపురంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో కాన్వాయ్‌ లోని ఒక కారు మరొక కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు చెరువులో బోల్తాపడ్డాయి. ఇందులోని ఒక కారులో జీసీసీ ఛైర్మన్‌ దరావత్‌ మోహన్‌ గాంధీ నాయక్‌ ఉన్నారు. ప్రమాదంతో ఆయన షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. వారిద్దరినీ హుటాహుటీన జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

errabelli convoy accident
janagama
batukamma saris supplies
  • Loading...

More Telugu News