2002 gujarat riots case: ఆ రోజు మాయా కోద్నాని నరోదా గామ్ లో లేరు: అమిత్ షా
- ప్రత్యేక కోర్టులో అమిత్ షా వాంగ్మూలం
- గొడవలు జరిగిన రోజు ఆమె అక్కడ లేరన్న షా
- కోర్టు సమన్లు అందుకున్న 14 మంది డిఫెన్స్ సాక్షుల్లో షా ఒకరు
2002లో చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్ల కేసులో డిఫెన్స్ సాక్షిగా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీజేపీ నాయకురాలు మాయా కోద్నాని తరపున సాక్షిగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
అల్లర్లు జరిగిన రోజు మాయా కోద్నాని నరోదా గామ్ లో లేరని ఆయన తెలిపారు. గోద్రా రైల్వే స్టేషన్ లో సబర్మతి ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టిన మరుసటి రోజైన ఫిబ్రవరి 28న ఆమెను అసెంబ్లీలో, ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో కలిశానని తన వాంగ్మూలంలో షా పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు అసెంబ్లీలో ఆమెను కలిశానని... ఆ తర్వాత 9.30 నుంచి 9.45 గంటల మధ్య సమయంలో సివిల్ ఆసుపత్రిలో కలిశానని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసిన 14 మంది డిఫెన్స్ సాక్షుల్లో అమిత్ షా ఒకరు.