dilip bail: మలయాళ నటుడు దిలీప్ కు నాలుగోసారి బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం

  • భావన వేధింపుల కేసులో దిలీప్ కు చుక్కెదురు
  • నాలుగోసారి బెయిల్ నిరాకరణ
  • 71 రోజులుగా జైల్లో దిలీప్
  • ఈ నెల 28న దిలీప్ తాజా చిత్రం విడుదల

ఫిబ్రవరి 17న జరిగిన మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ నటుడు దిలీప్ కు న్యాయస్థానం నాలుగోసారి బెయిల్ నిరాకరించింది. 71 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దిలీప్ గతంలో మూడు సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతనికి బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన అంగమలై మెజిస్ట్రేట్ న్యాయస్థానం అప్పటి నుంచి అతనికి బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి కూడా బెయిల్ నిరాకరించడంతో ఆయన ఆశ నిరాశ అయింది. కాగా, ఈ నెల 28న దిలీప్ తాజా సినిమా విడుదల కానుంది. 

dilip bail
dilip
bhavana
angamali court
  • Loading...

More Telugu News