batukamma saries: బతుకమ్మ చీరల పంపిణీలో అపశ్రుతి.. కొట్టుకున్న మహిళలు!


బతుకమ్మ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, దీనికి సంబంధించిన ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో, పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లోని సైదాబాద్ సరస్వతి శిశు మందిరంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో క్యూలైన్ల వద్ద మహిళలు కొట్టుకున్నారు. జుట్టు పీక్కున్నారు. బాహీబాహికి దిగిన మహిళలను విడదీయడం అక్కడున్న మహిళా పోలీసుల వల్ల కూడా కాలేదు. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలు కూడా అయ్యారు. భయాందోళనలకు గురైన కొందరు మహిళలు... చీరలు తీసుకోకుండానే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.

batukamma saries
telangana batukamma
fight in batukamma saries programme
  • Loading...

More Telugu News