posani krishnamurali: రెమ్యునరేషన్ ఎంత ఎక్కువిచ్చినా రాత్రివేళ పనిచేయను!: పోసాని

  •  ఈ మధ్య కాలంలో నటుడిగా పోసాని బిజీ బిజీ
  •  రాత్రివేళ షూటింగ్ అంటే మాత్రం నో చెప్పేస్తారట
  •  ఆరోగ్యం దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం
  •  ఎంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా ఇది మారదు  
  • 'పైసా వసూల్' అందుకే వదిలేశాడట 

కొంతకాలం క్రితం రచయితగా పోసాని కృష్ణమురళి ఎంత బిజీగా వున్నారో, ఈ మధ్య నటుడిగా ఆయన అంతే బిజీగా వున్నారు. ఆయన ఎంపిక చేసుకుంటున్న పాత్రలు .. ఆయన నటనలోని వైవిధ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి పోసాని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాత్రి సమయాల్లో షూటింగ్ ఉంటే తాను ఒప్పుకోవడం లేదని చెప్పారు.

 ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత సేపైనా షూటింగులో పాల్గొనడానికి తనకి అభ్యంతరం లేదని అన్నారు. అయితే రాత్రి సమయాల్లో మాత్రం పనిచేయదలచుకోలేదని చెప్పారు. ఎంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినా ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోదలచుకోలేదని అన్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఈ కారణంగా కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకోవలసి వచ్చిందని చెప్పారు. అలాంటి సినిమాల్లో 'పైసా వసూల్' కూడా ఒకటని స్పష్టం చేశారు.   

posani krishnamurali
  • Loading...

More Telugu News