ntr: ఎన్టీఆర్ తో డాన్స్ చేయడమే అదృష్టం .. డబ్బు గురించిన ఆలోచనే చేయలేదు : తమన్నా


 స్పెషల్ సాంగ్ చేయడం కథానాయికలకు ఒక గౌరవం లాంటిదనీ .. కథను ప్రత్యేక గీతం మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకువెళుతుందని కొంతకాలం క్రితం తమన్నా చెప్పింది. అలాంటి తమన్నా 'జై లవ కుశ' సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి 'స్వింగ్ జరా' అంటూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ చేసినందుకు గాను పారితోషికంగా ఆమె 60 లక్షల వరకూ వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఇందుకు సంబంధించిన ప్రశ్న తాజాగా తమన్నాకు ఎదురైంది. ఎన్టీఆర్ తో తనకి ఎంతో అనుబంధముందనీ, ఆయనతో కలిసి డాన్స్ చేయడమే అదృష్టమని తమన్నా చెప్పింది. ఈ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ తనకి వచ్చినప్పుడు, తాను ఎంతమాత్రం డబ్బు గురించి ఆలోచించలేదని అంది. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో జోడీగా క్రేజీగా డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ లో చేయమంటూ ఆఫర్ వస్తే, ఎవరైనా డబ్బుగురించి ఆలోచిస్తారా? అంటూ ఎదురు ప్రశ్న వేసింది.     

ntr
tamannah
  • Loading...

More Telugu News