batukamma saris: కేసీఆర్ సారూ!...నీ కూతురు కవిత కూడా ఇవే సీరలు కట్టుకుని బతుకమ్మ ఆడుతదా?: మహిళల ప్రశ్న

  • గద్వాల చీరలని వంద రూపాయల చీరలు అంటగడతారా?
  • ఈ చీరలు కట్టుకుని కవిత బతుకమ్మ ఆడుతదా, కేసీఆర్ సారూ?
  • పేదలంటే చులకనా?
  • వంద రూపాయల చీర కోసం 300 కూలి వదిలిపెట్టి వచ్చినం
  • రోడ్డుపై బతుకమ్మ పంపిణీ చీరలను తగులబెట్టిన మహిళలు

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీపై ప్రజలు భగ్గుమంటున్నారు. గద్వాల చీరల పంపిణీ అని టీవీ ఛానెళ్లలో ప్రకటించి, తీరా పంపిణీకి వచ్చేసరికి తమకు 100 రూపాయల చీరలు అంటగడుతున్నారని జనగామ, భువనగిరి, జగిత్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల మహిళలు మండిపడ్డారు. ఈ 100 రూపాయల చీరల కోసం 300 రూపాయల కూలీ పనులు మానుకుని వచ్చామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ ఉత్సవాల్లో ఈ చీరలు కట్టుకుని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత బతుకమ్మ ఆడతదా? అని పలువురు మహిళలు ప్రశ్నించారు. పేద మహిళలంటే అంత చులకనా, కేసీఆర్ సారూ? అని వారు నిలదీశారు. 60-70 రూపాయలకు వచ్చే చీరలను ఎవరైనా పండుగపూట కట్టుకుంటరా? అని వారు మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను రోడ్డుపై వేసి తగులబెట్టి, తమ నిరసన తెలిపారు. 

batukamma saris
batukamma
telangana
batukamma saris supplies
  • Loading...

More Telugu News