uttar pradesh police: నేరగాళ్లపై యూపీ సీఎం యోగి ఉక్కుపాదం.. ఆరు నెలల్లో 420 ఎన్ కౌంటర్లు!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నేరగాళ్లపై యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పోలీసులు, నేరగాళ్లకు మధ్య ఏకంగా 420 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏకంగా 15 మంది రౌడీలు హతమయ్యారు. ఈ వివరాలను ఐజీ హరీరామ్ శర్మ తెలిపారు. నేరగాళ్లు, రౌడీలు లొంగిపోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే 69 మంది నేరగాళ్ల ఆస్తులను సీజ్ చేశామని చెప్పారు. నేరగాళ్ల ఆట కట్టించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

uttar pradesh police
yogi adityanath
up crime
  • Loading...

More Telugu News