posani krishnamurali: 70 లక్షలు పోగొట్టుకున్నా .. పది కోట్లు తెచ్చిపెట్టా!: పోసాని
- రచయితగా కొనసాగుతూనే దర్శకుడిగా ప్రయోగం
- మొదటి సినిమాతో స్వల్ప నష్టాలు
- రెండవ సినిమాతో భారీ లాభాలు
- తాను నష్టపోయినంతే రాబట్టుకున్నానన్న పోసాని
ఈ మధ్య కాలంలో విలక్షణమైన నటుడిగా తనదైన ముద్రవేసిన పోసాని మురళీకృష్ణ, అంతకుముందు రైటర్ గా ఒక వెలుగు వెలిగారు. ఎన్నో సినిమాలకి ఆయన కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను అందించారు. అలా రచయితగా తాను మంచి జోరుమీద వున్నప్పుడే, దర్శకుడిగా 'శ్రావణ మాసం' సినిమాను తెరకెక్కించానని ఆయన చెప్పారు. ఈ సినిమా వలన తాను 70 లక్షలను పోగొట్టుకున్నానని అన్నారు.
ఆ తరువాత తనదైన శైలిలో 'ఆపరేషన్ దుర్యోధన'కి దర్శకుడిగా వ్యవహరించాననీ, ఆ సినిమా 10 కోట్ల వరకూ లాభం తెచ్చిపెట్టిందని చెప్పారు. అయితే ఆ లాభం .. సినిమా కోసం 1.3 కోట్లు ఫైనాన్స్ చేసిన వ్యక్తికే వెళ్లిందని అన్నారు. ఆనందంతో ఏం కావాలని తనని ఆయన అడిగితే, అంతకుముందు తాను నష్టపోయిన 70 లక్షలను మాత్రమే ఇవ్వమని అడిగానని చెప్పారు. అయితే ఆయన ఆ డబ్బుతో పాటు కొత్త కారును కూడా పంపించాడనీ, కారును మాత్రం తాను సున్నితంగా తిరస్కరించానని అన్నారు.