amith shaw: 2002 అల్లర్ల కేసులో కోర్టుకు హాజరైన అమిత్ షా!
- డిఫెన్స్ సాక్షిగా కోర్టుకు హాజరైన అమిత్ షా
- కచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని గత వారం ఆదేశించిన జడ్జి
- హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నేత
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ లోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న అల్లర్ల కేసు విచారణకు సంబంధించి ఆయన కోర్టుకు వచ్చారు. బీజేపీకి చెందిన మహిళా నేత మాయా కొద్నాని ఈ కేసుకు సంబంధించి హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో డిఫెన్స్ సాక్షిగా అమిత్ షా కోర్టుకు హాజరయ్యారు. అహ్మదాబాద్ శివార్లలోని నరోడా గామ్ లో అప్పుడు 11 మంది ముస్లింలు దారుణ హత్యకు గురయ్యారు.
ఈ కేసును విచారించిన జడ్జి... అమిత్ షా కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని గత వారం ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు జరిగే సమయంలో అమిత్ షా గుజరాత్ మంత్రిగా ఉన్నారు. ఈ హత్య కేసులోనే కాకుండా, 100 మంది ముస్లింలపై జరిగిన దాడి కేసులో కూడా మాయా ముద్దాయిగా ఉన్నారు. అప్పట్లో ఆమె కూడా మంత్రి పదవిలో ఉన్నారు.