aravindswami: మణిరత్నం మల్టీ స్టారర్ కి రంగం సిద్ధమవుతోంది!

  •  మల్టీ స్టారర్ ప్రాజెక్టుతో రంగంలోకి
  •  భారీతారాగణం ఎంపిక పూర్తి
  •  జనవరిలో సెట్స్ పైకి      

'చెలియా' సినిమా తమిళ .. తెలుగు భాషల్లో మణిరత్నానికి పరాజయాన్ని మిగిల్చింది. దాంతో ఆయన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నారు. మల్టీ స్టారర్ మూవీకి తగిన కథా వస్తువును ఆయన ఈసారి సిద్ధం చేసుకున్నారు. తన కథకి తగిన పాత్రల కోసం ఆయన అరవింద్ స్వామి .. జ్యోతిక .. శింబు .. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు.

జనవరి నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి, సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మణిరత్నం వున్నారట. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.          

aravindswami
jyothika
  • Loading...

More Telugu News