team india: అతన్ని టార్గెట్ చేయాలని నేను, ధోనీ ముందే అనుకున్నాం: పాండ్యా

జంపాను టార్గెట్ చేయాలనుకున్నాం

ప్లాన్ వర్కౌట్ అయింది

నాలో ఎలాంటి మార్పు లేదు

నేను పాత్ హార్దిక్ నే


ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత తక్కువ స్కోరుకే టీమిండియా వికెట్లను కోల్పోయినప్పటికీ... ధోనీ, పాండ్యాలు అద్భుతమైన ఆటతీరుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 66 బంతుల్లో 83 పరుగులు చేసిన పాండ్యా.. ఆ తర్వాత రెండు కీలకమైన వికెట్లు కూడా తీసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ, స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్ కు వస్తాడని, అతన్ని టార్గెట్ చేయాలని తాను, ధోనీ అనుకున్నామని చెప్పాడు. జంపా బౌలింగ్ లో పరుగుల వరద పారించాలని ప్లాన్ వేశామని తెలిపాడు. జంపా బౌలింగ్ లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తనలో ఎలాంటి మార్పు రాలేదని, తాను పాత హర్దిక్ నే అని చెప్పాడు. అయితే, గతంలో కంటే కొంచెం శాంతంగా మారి ఉండవచ్చని తెలిపాడు.

team india
australia series
hardik pandya
dhoni
  • Loading...

More Telugu News