iliana: ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోను షేర్ చేసిన ఇలియానా!

  • ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ నీబోన్ తో ఇల్లీ సహజీవనం
  • 'ప్రేమ అనే పిచ్చి లోకంలో ఉన్నా'నన్న గోవా బ్యూటీ 
  • తరచుగా ఫొటోలను షేర్ చేస్తున్న ఇల్లీ

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చెక్కేసిన గోవా భామ ఇలియానా తన బోయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ నీబోన్ తో ఇల్లీ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. తన బోయ్ ఫ్రెండ్ తో కలసి ఉన్న ఫొటోలను అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, ఆమె వార్తల్లో నిలుస్తుంటుంది. తాగాజా నీబోన్ తో సన్నిహితంగా ఉన్న మరో ఫొటోను ఆమె అప్ లోడ్ చేసింది. 'ప్రేమ అనే పిచ్చి లోకంలో..' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

మరోవైపు తన బోయ్ ఫ్రెండ్ గురించి ఇటీవల మాట్లాడుతూ, అతను చాలా సాధారణంగా ఉంటాడని, రకరకాల వార్తలతో అతని ప్రైవసీకి భంగం కలిగించలేనని ఇలియానా చెప్పింది. సినీ పరిశ్రమలోని నటీనటులను అభిమానులు ఎంతో ప్రేమిస్తారని, కొన్ని సందర్భాల్లో అంతకు మించి ద్వేషిస్తారని, తాను ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి... విమర్శలు తనకు తప్పదని, కానీ, నీబోన్ మాటలు పడటం తనకు ఇష్టం ఉండదని తెలిపింది.

iliana
tollywood
bollywood
iliana boy friend
iliana kiss
  • Loading...

More Telugu News