ramgopal verma: రూటు మార్చిన వర్మ... ఎన్టీఆర్ సినీ నిర్మాణంపై సంచలన ప్రకటన!

  • ఎన్టీఆర్ పై నిర్మించబోయే సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
  • ఎన్టీఆర్ జీవిత విశేషాలు, జరిగిన అవమానాలు, వెన్నుపోట్లపై సినిమా
  • ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తానని ప్రకటించిన ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ సినిమా ప్రకటనపై రూటు మార్చాడు. గతంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తానని ప్రకటించిన రాంగోపాల్ వర్మ... తన సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్ర కాదని, తాను ఎన్టీఆర్ పై నిర్మించబోయే సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అని ప్రకటించాడు. ఎన్టీఆర్ జీవిత విశేషాలు, జరిగిన అవమానాలు, వెన్నుపోట్లపై సినిమా రూపొందిస్తానని తెలిపాడు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపాడు. కాగా, ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మిస్తానని ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తేజ దర్శకత్వం వహిస్తాడంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. 

ramgopal verma
ntr
ntr movie
verma ntr movie new name
  • Loading...

More Telugu News