simbu: శింబు, హన్సికల పెళ్లి జరగకపోవడానికి కారణం ఇదే: శింబు తండ్రి రాజేందర్

  • హన్సిక వల్లే పెళ్లి ఆగిపోయింది
  • పెళ్లి తర్వాత సినిమాలు వద్దనే విషయం ఆమెకు నచ్చలేదు
  • శింబు దైవ భక్తిలో ఉన్నాడు
  • 'నాన్నా తుది నిర్ణయం మీదే' అంటున్నాడు

కోలీవుడ్ హీరో శింబు సాగించిన ప్రేమాయణాలు అందరికీ తెలిసిందే. మొదట నయనతారతో అఫైర్ నడిపిన శింబు... ఆ తర్వాత హన్సికను ప్రేమించాడు. వారిద్దరితో కూడా శింబు ప్రయాణం దాదాపు పెళ్లి ముందు వరకు వెళ్లి, ఆగిపోయింది. ఈ అంశంపై శింబు తండ్రి ప్రముఖ నట, దర్శకనిర్మాత టి.రాజేందర్ మాట్లాడుతూ, శింబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.

శింబును ఇష్టపడిన హన్సికకు అతను ఒక్కటే చెప్పాడని... తమ పెళ్లి తన అమ్మానాన్నల ఇష్టపూర్వకంగానే జరుగుతుందని స్పష్టం చేశాడని తెలిపారు. 'మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన తర్వాత అమ్మ సినిమాలకు దూరంగా ఉంది. మన పెళ్లి జరిగిన తర్వాత కూడా నీవు సినిమాలకు దూరంగా ఉండాలి' అని శింబు చెప్పాడని అన్నారు. అయితే, దానికి హన్సిక అంగీకరించలేదని... దాంతో, వారి అనుబంధం పెళ్లి వరకు వెళ్లలేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం శింబు దైవభక్తిలో ఉన్నాడని... 'నాన్నా, ఏదైనా మీరే నిర్ణయించండి' అని చెబుతున్నాడని అన్నారు.

simbu
hansika. t rajeder
simbi marriage
hansika marriage
simbu hansika marriage
  • Loading...

More Telugu News