narendra modi: తనకు సహకరించాలంటూ మోహన్ లాల్ కు నరేంద్ర మోదీ లేఖ

  • 'స్వచ్ఛతా హీ సేవా'కు సాయం చేయండి
  • మీకెంతో ప్రత్యేక గుర్తింపుంది
  • మీరు కదిలితే లక్షల మంది నడుస్తారు
  • మోహన్ లాల్ కు రాసిన లేఖలో మోదీ

ప్రముఖ దక్షిణాది నటుడు మోహన్ లాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖను రాస్తూ, తన కార్యక్రమాల్లో భాగస్వామిగా మారి సహకరించాలని కోరారు. కేంద్రం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా'లో మోహన్ లాల్ సహకారాన్ని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తాను రాసిన లేఖలో "దేశాన్ని పరిశుభ్రంగా చేయడం ద్వారా పేదలకు ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. చిత్ర రంగంలో మీకు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతో ప్రజల జీవితాల్లో మీరు పాజిటివిటీని నింపవచ్చు. ఆ శక్తి మీకుంది. స్వచ్ఛతా హీ సేవా వంటి మంచి కార్యక్రమానికి మీరు సహకరించాలి. స్వచ్ఛ భారత్ సాధన దిశగా మీరు కొంత సమయం కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ముందడుగు వేస్తే, లక్షల మంది మీ వెంట కదిలొస్తారు. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది" అని అన్నారు. మోదీ రాసిన ఈ లేఖపై మోహన్ లాల్ ఇంకా స్పందించాల్సి వుంది.

narendra modi
mohanlal
swatcha bharat
  • Loading...

More Telugu News