jayaprada: రాజకీయాలకు దూరం... జీవితాంతం సినిమాలే: జయప్రద

  • రాజకీయాల్లో ఉండబట్టే దర్శకులు రాలేదు
  • ఇకపై సినిమాలపైనే దృష్టి: జయప్రద
  • ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్న నాటి అందాల నటి

అలనాటి అందాల తార, రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు దూరమై, అడపాదడపా తనలోని నటిని చూపిస్తూ వచ్చిన జయప్రద, ఇకపై సినిమాలే లోకంగా కాలం గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇంతకాలమూ తాను రాజకీయాల్లో కొనసాగుతుండబట్టే దర్శకులు తన వద్దకు సరైన పాత్రలతో రావడం లేదని, ఇకపై రాజకీయాలు పక్కనబెట్టి, సినిమాలపైనే దృష్టిని సారిస్తానని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తాను నాలుగు చిత్రాలు చేస్తున్నానని వెల్లడించిన జయప్రద, మంచి పాత్ర అయితే, నిడివి తక్కువైనా నటించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా, సమాజ్ వాదీ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జయప్రద, గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆమె, మెగాస్టార్ చిరంజీవితో కలసి 'శరభ' చిత్రం పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

jayaprada
sharabha
samajwadi
  • Loading...

More Telugu News