facebokok: సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్న ఫేస్‌బుక్
- `స్నూజ్` పేరుతో అందుబాటులోకి
- ఇష్టంలేని పోస్టులను నిలిపివేసే సదుపాయం
- తాత్కాలికంగా ఫ్రెండ్స్‌ను మ్యూట్‌లో పెట్టుకునే అవకాశం
ఫ్రెండ్స్, పేజీలు, గ్రూపుల నుంచి వచ్చే ఫీడ్‌ను నియంత్రించే అవకాశాన్ని త్వరలో ఫేస్‌బుక్ కల్పించనున్నట్లు తెలుస్తోంది. అన్‌లైక్, అన్‌ఫ్రెండ్ చేయకుండానే ఆయా వ్యక్తులు, పేజీలు, గ్రూపులు చేసే పోస్టులను మ్యూట్‌లో పెట్టుకునే అవకాశాన్ని కల్పించనుంది. `స్నూజ్` పేరుతో పిలిచే ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఫేస్‌బుక్ నిపుణులు పరీక్షిస్తున్నట్లు సమాచారం. యూజర్లకు నచ్చిన ఫీడ్‌ని మాత్రమే వాల్ మీద కనిపించేలా చేసేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. అందుకోసమే ఇలాంటి కొత్త ఫీచర్ల వేటలో పడుతోంది.
`స్నూజ్` బటన్ నొక్కడం ద్వారా కొద్ది సమయం వరకు ఆయా వ్యక్తుల, పేజీల, గ్రూపుల ఫీడ్‌ను రాకుండా అదుపుచేయవచ్చు. ఎప్పటివరకు మ్యూట్‌లో ఉంచాలన్న విషయాన్ని కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫేస్‌బుక్ వారి సమాచార యాప్ వాట్సాప్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.