ప్రేమ మత్తులో కొన్ని తప్పులు చేశా: హీరోయిన్ రెజీనా
కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడటంతో... తనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోయాయని తెలిపింది. ఇప్పుడు ఆ మత్తును వదిలించుకున్నానని... ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలను వదిలేసి, కెరీర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని చెప్పింది. అయితే, ఎవరి ప్రేమలో పడిందనే విషయాన్ని మాత్రం ఈ అమ్మడు వెల్లడించలేదు. కానీ, ఆమె ప్రియుడు ఎవరన్న విషయం అందరికీ తెలిసిందేనని కొందరు అంటున్నారు.