Kangana Ranaut: నటి కంగన వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టర్ విడుదల చేసిన ‘అమూల్’!

  • కంగన- ఆదిత్య పంచోలీ వివాదాన్ని యాడ్‌గా మలచుకున్న అమూల్
  • తాజా యాడ్‌ విడుదల చేసిన పాల ఉత్పత్తుల సంస్థ
  • వ్యాపారాన్ని పెంచుకునే వ్యూహం

బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. నటుడు ఆదిత్య పంచోలీపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అతడు తనను శారీరకంగా తీవ్రంగా హింసించాడంటూ బాంబు పేల్చింది. అంతేకాదు తాను ఎవరినీ వదిలిపెట్టే సమస్యే లేదని హెచ్చరించి కలకలం రేపింది.

ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ముందుకొచ్చేసింది. తాజా పరిణామాలను ఫాలో అవడంలో ముందుండే  అమూల్.. కంగన వివాదాస్పద వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ తమ ఉత్పత్తుల ప్రకటనను విడుదల చేసింది. తాజా ప్రకటనలో అమూల్ బేబీతో కంగన మాట్లాడుతున్నట్టున్న పోస్టర్‌ను ముద్రించింది. ఈ యాడ్‌లో ‘‘వివాదం వల్ల ఎప్పటికీ ఉపయోగం లేదు. అది హీరోలైనా, హీరోయిన్‌లైనా’’ అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించింది. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమూల్ ప్రకటనపై కంగన నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. 

Kangana Ranaut
Bollywood
Amul
Aditya Pancholi
Add
  • Loading...

More Telugu News