dhoni: ధోనీని 'గోట్' అన్న సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్

  • గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
  • అభిమాని ప్రశ్నకు మాలిక్ సమాధానం
  • ఆనందపడుతున్న ధోనీ ఫ్యాన్స్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాక్ క్రికెటర్ ధోనీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ధోనీపై మీ అభిప్రాయమేంటని ప్రశ్నిస్తే 'గోట్' అనేశాడు. షోయబ్ ఏ ఉద్దేశంతో అలా అన్నాడో, గోట్ అంటే ఏంటో తెలుసుకున్న అభిమానులు ఆయన సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ తో ఆడుతున్న వరల్డ్ ఎలెవన్ జట్టులో మాలిక్ భాగమై ఉన్నాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా షోయబ్ అభిమానులతో మాట్లాడాడు.

 ఇక 'గోట్' అంటే 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అంటూ కూడా షోయబ్ చెప్పాడు. ఇక తమ అభిమాన స్టార్ ప్లేయర్ ధోనీ గురించి పాకిస్థాన్ ఆటగాడి నుంచి ఇలాంటి పొగడ్త రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదన్న సంగతి తెలిసిందే. వరల్డ్ సిరీస్ లలో మాత్రం ఇరు దేశాలూ పోటీ పడుతున్నాయి. చివరిగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో భారత్, పాక్ తలపడగా, పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

dhoni
shoaib malik
saniya mirza
  • Error fetching data: Network response was not ok

More Telugu News