spyder: ఎస్జే సూర్య మాట్లాడేందుకు వస్తే నానాయాగీ చేసిన ప్రిన్స్ అభిమానులు... సుమ కల్పించుకోవడంతో కామ్!

  • మాట్లాడేందుకు వీల్లేదంటూ అరుపులు, కేకలు
  • గతంలో మహేష్ తో 'నాని' చిత్రం తీసిన ఎస్జే సూర్య
  • ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో అభిమానుల ఆగ్రహం
  • దాని ప్రభావమే నిన్నటి అభిమానుల గొడవకు కారణం!

గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో, చిత్ర విలన్, నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య మాట్లాడేందుకు వేదికపైకి ఎక్కగానే, మహేష్ అభిమానులు గొడవకు దిగారు. అతను మాట్లాడేందుకు వీల్లేదంటూ కేకలు పెట్టారు. పెద్దగా అరుస్తూ, చేతులు అడ్డంగా ఊపుతూ తమ నిరసనలు తెలిపారు. ఆ సమయంలో తాను రెండు నిమిషాలు మాట్లాడతానని, కొంచెం సేపు ఆగాలని సూర్య కోరినా ఎవరూ వినలేదు. అప్పుడు యాంకర్ సుమ కల్పించుకుని, దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్న సూర్య చెప్పే మాటలను మహేష్ బాబు విందామని అనుకుంటున్నారని, ఆయన ఏం చెబుతారో అందరమూ విందామని కోరింది. దీంతో గొడవ కొంత మేరకు సద్దుమణిగింది.

అసలింతకూ సూర్య మాట్లాడేందుకు వస్తే, మహేష్ అభిమానులు గొడవ చేసిన కారణం తెలుసా? పదహారు సంవత్సరాల క్రితం... అంటే 2001లో పవన్ కల్యాణ్ తో 'ఖుషీ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చిన ఎస్జే సూర్య, ఆపై మూడేళ్ల తరువాత 2004లో మహేష్ బాబుతో 'నాని' సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. పదమూడేళ్ల నాటి ఆ ఫ్లాప్ ఇంకా అభిమానుల మదిలో నుంచి తొలగినట్టు లేదు. అదే సూర్యపై వ్యతిరేకత రూపంలో కనిపించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News