bandla ganesh: పవన్ ను, ఎన్టీఆర్ ను తెగ పొగిడేస్తోన్న బండ్ల గణేశ్!


నిర్మాతగా బండ్ల గణేశ్ కొంతకాలం క్రితం వరకూ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లాడు. వాటిలో సూపర్ హిట్ అయినవీ వున్నాయి .. పరాజయం పాలైనవి వున్నాయి. నిర్మాతగా ఆయన సాధించిన సక్సెస్ ఎంత అనే విషయం పక్కన పెడితే, ఒక వైపున పవన్ కి .. మరో వైపున ఎన్టీఆర్ కి ఆయన దూరమయ్యాడు. వాళ్ల అభిమానుల అసహనానికి కూడా కారణమయ్యాడు.

అలాంటి బండ్ల గణేశ్ కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఆయన పవన్ ను పొగిడేయడం .. ఆయన సినిమా ఫంక్షన్స్ కి సంబంధించిన వీడియోలు పెట్టడం చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ కి తాను సారీ చెప్పేసిన వీడియోను షేర్ చేశాడు. 'జై లవ కుశ' బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని చెప్పేశాడు. ఇదంతా చూసినవాళ్లు .. పవన్ - ఎన్టీఆర్ లతో మళ్లీ సినిమాలను నిర్మించే ఆలోచనలో వున్నాడేమోనని చెప్పుకుంటున్నారు.  

bandla ganesh
  • Loading...

More Telugu News