Samanta: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!


*  చెన్నయ్ బ్యూటీ సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి చిత్రంలో కథానాయికగా నటించనుంది. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి 'సూపర్ డీలక్స్' అనే టైటిల్ని ఖరారు చేశారు.  
*  మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ శుక్రవారం సాయంకాలం హైదరాబాదులో నిర్వహిస్తారు. మాదాపూర్ శిల్పకళా వేదిక ఆడిటోరియంలో అభిమానుల సమక్షంలో ఈ ఫంక్షన్ జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
*  శింబు హీరోగా అతని తండ్రి టి. రాజేందర్ నిర్మించిన 'సరసుడు' డబ్బింగ్ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.
*  నాని కథానాయకుడుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందే 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం షూటింగ్ త్వరలో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో జరుగుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, రుక్షార్ మీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.    

  • Loading...

More Telugu News